ఎనిమిదికి పెరిగిన టీడీపీ సభ మృతుల సంఖ్య

  • నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • కందుకూరు సభలో ఘోర ప్రమాదం
  • కార్యకర్తల మధ్య తొక్కిసలాట
  • సభ రద్దు చేసుకున్న చంద్రబాబు
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభ తీవ్ర విషాదకర పరిస్థితుల నడుమ రద్దయింది. కార్యకర్తల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది  మృతి చెందారు. మరికొందరు కందుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మర్లపాటి చినకొండయ్య (అమ్మపాలెం), కాకుమాని రాజా (కందుకూరు), పురుషోత్తం (కందుకూరు), కలవకూరి యానాది (కొండముడుసుపాలెం), దేవినేని రవీంద్రబాబు (ఆత్మకూరు), యాటగిరి విజయ (ఉలవపాడు) అనే ఆరుగురిని గుర్తించారు. మరో ఇద్దరి  వివరాలు తెలియాల్సి ఉంది.

TDP
Rally
Chandrababu
Kandukur
Nellore District

More Telugu News